నెల్లూరు నుంచి సంగం మండలానికి వెళ్తున్న మినీ ట్రక్.. అదుపు తప్పి అన్నారెడ్డిపాలెం గ్రామ సమీపంలో ఉన్న కాల్వలో పడిపోయింది. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నారు. లారీని క్రేన్ సాయంతో బయటకు తీసినా పుస్తకాలన్నీ నీటిలో పడిపోయాయి. పూర్తిగా తడిచిపోయి పుస్తకాలు దేనికీ పనికిరాకుండా తయారయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.